![]() |
![]() |
.webp)
దీపికా రంగరాజు బ్రహ్మముడి సీరియల్ లో మానస్ కి జోడీగా నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. దీపికా ఎక్కడ ఉంటే అక్కడ అల్లరి అల్లరి. ఏ షోకి వెళ్లినా అల్లరి చేస్తూ కనిపిస్తుంది. తమిళనాడులోని చెన్నైలో పెరిగిన ఈ బ్యూటీ మోడల్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని తమిళ్ మూవీస్ లో కూడా నటించింది. ఆ తరువాత సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మూవీ ఇండస్ట్రీకి రాక ముందు ఆమె తమిళ న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించింది. అలాంటి దీపికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
.webp)
సుప్రీం కోర్ట్ సెలవుల మీదే కన్నేసింది. ఏడాదిలో సుప్రీమ్ కోర్ట్ కేవలం 193 రోజులు మాత్రమే పని చేస్తుంది అనేది దాని సారాంశం. 45 రోజులు సమ్మర్ హాలిడేస్, 15 రోజులు వింటర్ హాలిడేస్, 7 రోజులు హోలీ బ్రేక్, 5 రోజులు దసరా హాలిడేస్, 5 రోజులు దివాలీ హాలిడేస్. ఇన్ని సెలవలు ఉంటాయన్న విషయం ఇంజనీరింగ్ కాలేజీలో చేరక ముందు తెలిసిఉంటే ఇంజనీరింగ్ చదవకుండా న్యాయ శాస్త్ర విద్యనే చదివేదాన్ని కదా అంటూ ఫన్నీ ఎమోజి పెట్టి తన అభిప్రాయాన్ని కామెడీగా షేర్ చేసుకుంది.
"బ్రహ్మముడి’ సీరియల్ లో బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చిన దీపిక రంగరాజు తన నటనతో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. హీరో రాజ్‌తో ఎప్పుడూ గొడవపడుతూ ఉంటుంది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ‘బ్రహ్మముడి’ సీరియల్ బెంగాలీ సీరియల్ ‘గట్చోరా’కి రీమేక్. ఈ సీరియల్ లో మానస్, దీపిక రంగరాజు, హమీదా, కిరణ్ కాంత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
![]() |
![]() |